ఐ టి డి ఏ లో సబ్సిడీ పథకాలను సకాలంలో ఆదివాసులకు అందించాలి
ఏ ఎస్పి డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర
భద్రాచలం ఐటీడీఏ దర్బారు నందు ఆదివాసిల సమస్యలతో కూడిన వినతిపత్రం పిఓ కి సమర్పిస్తూ ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు అందాల్సిన మౌలిక పథకాలు అందిపుచ్చుకోవడంలో ఆదివాసులు ఇంకా వెనుక బాటు తనానికే గురవుతున్నారని ఐటీడీఏ ద్వారా లబ్ధి పొందాల్సిన పథకాలు ఫలాలు లబ్ధి పొందడంలో విఫలమవుతున్నారని వాపోయారు అసలైన ఆదివాసులకు దక్కాల్సిన ఐటిడిఎ ఫలాలు నకిలీ ఎస్టీల పాలవుతున్నాయని కొందరు అధికారులు పూర్తిగా ఆదివాసులకు ఐ టి డి ఏ పథకాలు అందించడంలో నిర్లక్ష్యం జరుగుతుందని కనుక తమరి హాయంలో ఆయన ఉద్యోగ విషయంలో విద్య విషయంలోగా మౌలిక పథకాల విషయంలో నిజమైన ఆదివాసులకు పథకాలు అందేలా కృషి చేయాలని పిఓ ని కోరడమైనది అదేవిధంగా ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు గాని నీటి సౌకర్యం లేని రెవెన్యూ భూములకు గాని గిరి వికాసం పథకం కింద పంట బోర్లు అందించి ఆ యొక్క సాగు పంటలకు నిరంధించాలని మనవి చేశారు అదేవిధంగా సాగు చేస్తున్న రెవెన్యూ భూములకు పట్టాగలిగిన పోడు భూములకు ఆదివాసి రైతులు పంట బోర్లు వేయించడానికి అనుమతి ఇవ్వాలని విన్నవించారు పిఓ సానుకూలంగా స్పందిస్తూ వీటన్నిటి సమస్యకి త్వరలోనే పది రోజుల్లోనే సమస్యలను పూర్తి చెయిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి కొరస రామచంద్రయ్య కార్యదర్శి కోరం మురళి నరేష్ రామ్మూర్తి సర్వీస్ రావు తదితరులు పాల్గొన్నారు.