విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించాలి.

విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించాలి.

 

వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

 

పదవతరగతి విద్యార్థులు పై ప్రత్యేక శ్రద్ద ఉంచాలి…

 

చివ్వేంల కేజీబివి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన.

 

జిల్లా అదనపు (రెవిన్యూ )కలెక్టర్ పి రాంబాబు 

 

విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు (రెవిన్యూ ) కలెక్టర్ పి రాంబాబు అన్నారు గురువారం చివ్వేంల కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ వంట గదిని సందర్శించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గడువు తీరిన వంట వస్తువులు ఏమైనా వంట గదిలో ఉన్నాయా అని పరిశీలించి గడువు ముగిసిన వంట వస్తువులు వాడకూడదని సిబ్బంది కి సూచించారు. విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనం పరిశీలించి రోజు భోజనం బాగుంటుందా అని విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు.రాబోయే పదవతరగతి పరీక్షలలో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అలాగే ఉపాధ్యాయురాలు కూడా విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అలాగే చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారిని ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

 

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు….

 

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్చాలని జిల్లా అదనపు (రెవిన్యూ ) కలెక్టర్ పి రాంబాబు అన్నారు.గురువారం సూర్యాపేట మున్సిపాల్టీ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 29 నాడు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున జిల్లా లో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఎలాంటి పొరపాట్లు జరగకుండా అమలు పర్చాలని ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,చివ్వేంల ఆర్ ఐ శ్రావణి కేజీబివి ప్రత్యేక అధికారి నాగలక్ష్మి,

ఉపాధ్యాయురాలు జి దుర్గ, నీల శోభారాణి, గోదాకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment