అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను అమర్చితే కఠిన చర్యలు

అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను అమర్చితే కఠిన చర్యలు

 

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

 

అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించడం నేరం అని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు.అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్ల పట్ల కలిగే నష్టాలను ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద వాహనచోదకులకు జాతీయ రోడ్డు భద్రత మసోత్సవాల్లో భాగంగా ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ద్విచక్ర వాహనాలకు చట్ట విరుద్ధమైన అతి ధ్వని చేసే సైలెన్సులను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత శబ్దకాలుష్యం, ధ్వని కలుగజేసే సైలెన్స్లర్లను ఉపయోగించకూడదని యువత ఇలాంటి వాటి పట్ల దూరంగా ఉండి లక్ష సాధన కోసం శ్రమిస్తూ… బాగా చదివి జ్ఞానం సంపాదించుకోవలని అన్నారు.సురక్షత దృష్టితో ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు.అధిక ధ్వని కలిగించే సైలెన్స్లర్లను అమర్చిన వారు వాటిని తొలగించాలని లేదంటే జరీమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

 

*ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు*

 

 

వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయని అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపుతుదని వాహన చోదకులకు అవగాహన కల్పించారు.. యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు.

 

*గత నెల రోజుల వ్యవధిలో 24 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు*

 

గత నెల రోజుల వ్యవధిలో ద్విచక్ర వాహనాలకు చట్ట విరుద్ధమైన అతి ధ్వని చేసే సైలెన్సులను ఉపయోగించిన 24 మంది వాహన చోదకులకు జరిమానాలు విధించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు..

Join WhatsApp

Join Now

Leave a Comment