తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని 12వ వార్డులో నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫులిమామిడి రాజు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని 12వ వార్డులో నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫులిమామిడి రాజు 

 

 

 సదాశివపేట పట్టణంలోని నాలుగవ రోజున 12వ వార్డు నందు తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సదాశివపేట మున్సిపాలిటీ పక్షాన 12 వవార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు సభాధ్యక్షతన ప్రజల నుండి రేషన్ కార్డులకు సంబంధించిన, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను వార్డు ప్రజల నుండి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి ఈ పథకాన్ని రూపొందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ ఒక్క పేదకుటుంబం కూడా నిరుత్సాహ పడకుండా ప్రజల వద్దకే పాలన అన్నట్లు మన వార్డులోనే ప్రజా పాలనను నిర్వహించి మనకు అవసరమైనటువంటి రేషన్ కార్డులు గాని, ఇల్లు లేని వారికి ఇండ్లు పొందేలా, ఖాళీ స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరేలా, రైతులకు రైతు భరోసా లాంటి పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి నేరుగా ప్రభుత్వానికి ఆపీలు చేసుకోవడానికి ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎంతగానో దోహ పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు అన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని 12వ వార్డు ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోగలరని వారు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 13వ వార్డు కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, మున్సిపల్ టి.పి. ఓ భాస్కర్, మార్కెట్ కమిటీమాజీ డైరెక్టర్ నాగభూషణం, మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, శివ, నరేష్, ఆర్.పి.లు శారద, ఓ.బి.మాలె అనిత, ఉషా కిరణ్ యూత్ సభ్యులు, పిఎంఆర్ యువసేన సభ్యులు మరియు 12వ వార్డు ప్రజలందరూ పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version