శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

 

ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ

 

ఎమ్మెల్సీ ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ

 

 

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రులు టీచర్స్ శాసన మండలి సభ్యుల స్థానానికి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని 24 గంటలు 48 గంటలు,72 గంటలలో తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు జెండాలు ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేయడం జరుగుతుందని ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సీఈఓ అధికారులకు ఆదేశించారు.   

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్నద్ధంగా ఉండాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఎన్నికలనియమావళికు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ ఆర్టీవో రమాదేవి నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అధికారి మహిపాల్ రెడ్డి తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version