పోగొట్టుకున్న ఫోన్లను అందజేసిన ఎస్సై మహేందర్
కాగజ్ నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి నగేష్, నీమై మండల్ అనే ఇద్దరు తమ ఫోన్లను ఇటీవల పోగొట్టుకున్నారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలను నమోదుచేసి ట్రేస్ చేశారు. అనంతరం బాధితులకు వారి ఫోన్లను ఎస్సై మహేందర్ అందజేశారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.