ఆకట్టుకున్న బుద్ధిస్ట్ సైట్ చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకున్న బుద్ధిస్ట్ సైట్ చిత్రకళా ప్రదర్శన

 

చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో ప్రముఖ చిత్రకారుడు శిరంశెట్టి ఆనంద్ ఏర్పాటు చేసిన ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ చిత్రాలు ఎందరో చిత్రకళ అభిమానులను, ప్రముఖులను ఆకర్శిస్తున్నాయి ఆలోచింప చేస్తున్నాయి. 2వేల సంవత్సరాలక్రితం బుద్ధ చరిత్రపై 6నెలలు శ్రమించి 100 కు పైగా చిత్రాలు వేసి ప్రముఖుల సమక్షంలో ఆర్ట్ ప్రదర్శన, ఆర్ట్ పుస్తకా విష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా నడిగూడెం రాజావారి కోట నిర్వాహకులు, ఆర్టిస్ట్ కూడా కుర్రా జితేందర్ బాబు మాట్లాడుతూ ఫణిగిరి బుద్ధ చరిత్ర చాలా గొప్పదని, తవ్వకాలు జరిపే ముందు నేను ముందున్నానని ఆనంద్ ప్రతిభ అద్భుతం అంటూ అభినందించారు.డాక్టర్, రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రకళ వెలకట్టలేనిదని ఆనంద్ బొమ్మలకు పారితోసికం ఇచ్చి కొన్ని బొమ్మలు తీసుకున్నానని ఆనంద్ ను అభినదించారు. ప్రముఖ కధా రచయిత శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతూ మా ఆనంద్ బొమ్మలు అద్భుతం అంటూ, బుద్ధుడి ప్రధమ శిష్యుడు ఆనందుడే అంటూ అభినందించారు. మరొక అతిధి గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ అలుపెరుగని చిత్రకారుడిగా 6నెలలు శ్రమించి బొమ్మలు వేశాడని ఆనంద్ ను అభినందించారు. తాను కుట్టిన ఊరు ఫనిగిరి, అన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నారని, సూర్యాపేట పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని ఆనంద్ ను ప్రశంసించారు. ఈ వేడుకలో ప్రముఖులు, చిత్రకారులు కాసుల పద్మావతీ, కోట ప్రసన్నజ్యోతి, అనుపోజు ప్రభాకర్, పురుషోత్తం ఎందరో ప్రదర్శన తిలకించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఫణిగిరి బుద్ధిష్టి సైట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు

Art

Join WhatsApp

Join Now

Leave a Comment