గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు 

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు 

 

 

రామగిరి మండలం సెంటనరీకాలనీ స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో జనవరి 26న  నిర్వహించనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం రామగుండం-3 ఏరియా ఇంఛార్జ్ జనరల్ మేనేజర్ గుంజపడుగు రఘుపతి పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో వేడుకల నిర్వహణ కోసం సివిల్, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ విభాగాల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు అందించారు. వేడుకల్లో పాల్గొననున్న విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ డిజియం రాజేంద్ర కుమార్,  పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఏరియా సెక్యూరిటి ఆఫీసర్ షబ్బీరొద్దీన్, అధికారులు  గుర్రం శ్రీహరి, కోల శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment