సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో అన్నదానం
సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఓసిపి టు లో హెడ్ ఓవర్ మెన్ గా పనిచేస్తూ, సెంటీనరీకాలని లో నివాసం ఉంటున్న సింగరేణి ఉద్యోగి దొంతుల శ్రీనివాస్ సంతోషరాణి పెళ్లి రోజు సందర్భంగా నెలకు రూ.వంద – ఆపదలో అండ అనే స్ఫూర్తితో ఏర్పడిన సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తూ దినసరి కూలీ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారికి భోజనం పాకెట్స్ లను అందివ్వడం జరిగింది. అనంతరం దొంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల సింగరేణి యువ బలగం ప్రతినిధి బుడిగే క్రాంతి పెళ్లి రోజున చేసిన కార్యక్రమం చూసిన తరువాత మేము కూడా అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది వెంటనే సింగరేణి యువబలగం టీం వారిని సంప్రదించగా వారు ఒప్పుకోవడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా పెద వారికి ఒక పూట భోజనం పెట్టడం చాలా ఆనందం ఇచ్చిందని ఇలాంటి ఒక గొప్ప మధుర జ్ఞాపకాన్ని మా కుటుంబానికి అందించినందుకు సింగరేణి యువ బలగం సభ్యులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మీరు కూడా మీ ఇంట్లో జరిగే సంతోషకరమైన సమయంలో ప్రత్యక్షంగా గాని , పరోక్షంగా గాని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఉండి వీలు కాకపోతే మీరు సింగరేణి యువ బలగం టీం ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ బలగం సభ్యులు బుడిగే క్రాంతి,మేకల మారుతి యాదవ్,పాశం శ్రీనివాస్,కట్ల రవి, గంది శ్రీనివాస్,అంబటి చిరంజీవి,అడిగొప్పుల శ్రావణ్,గౌడ సత్యం, రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.