రేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్ కానిస్టేబులు నాగరాజు

రేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్ కానిస్టేబులు నాగరాజు

 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ మంగళవారం దాడులు చేయడం సంచలన సృష్టించింది.

పీడీఎస్ రేషన్ బియ్యం కేసులో బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. మొదటి విడతగా 30 వేల రూపాయలను ఫోన్ పే ద్వారా సూర్యాపేట లక్ష్మీ ఫీలింగ్ స్టేషన్ అకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు. మరొక రోజు ఏ 2 నాగరాజు పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా, అకౌంట్ కు బదిలీ మరొక 30 వేల రూపాయలు బదిలీ చేయించుకున్నారు మంగళవారం 70 వేల రూపాయలు ఏ వన్ ఎస్సై సురేష్, ఎ2 కానిస్టేబుల్ నాగరాజు లు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న విషయంలో సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైన్ నెంబర్ 12 / 2025 నమోదు చేశారు. బి ఎన్ ఎస్ ఎస్ అండర్ సెక్షన్ 35 కింద నోటీసు మాత్రమే ఇచ్చి రిమాండ్ చేయకుండా ఉండడానికి గాను పోలీసులు లంచం అడిగినట్టు ఏసీబీ అధికారులకు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయంలో లక్ష 40 వేల రూపాయలు పోలీసులకు ఇవ్వడానికి ఒప్పందం జరగగా బాధితుడి ఏసీబీ ని ఆశ్రయించారు. మంగళవారం ఫోన్ పే ద్వారా ఒకటోసారి 30 వేల రూపాయలు, రెండవసారి పదివేల రూపాయలు, బ్యాంక్ ఎకౌంట్ కు 30 వేల రూపాయలు మూడు దఫాలుగా మొత్తం 70 వేల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఒప్పందం ప్రకారం లక్ష 40,000 ల లో మిగతా బ్యాలెన్స్ ఉన్న 70 వేల రూపాయలు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లు మంగళవారం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీ బీ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి ఎస్ఎస్ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లను అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version