వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, 44 వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, నాణ్యమైన బ్రాండెడ్ దుస్తుల అమ్మకం ద్వారా మంచి పేరు సంపాదించాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు 44 వ వార్డులో కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్ లియన్ న్యూ ట్రెండ్స్ వస్త్ర దుకాణాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దిగా వుండే ఎంజి రోడ్ లో యువత మరియు పిల్లల కోసం ఆధునిక బ్రాండెడ్ షోరూం ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. వ్యాపార వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ షోరూం యజమానులు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోనే షోరూం ఏర్పాటుచేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎడ్ల వీరమల్లు గంగా భవాని, దుకాణ యజమానులు అక్కినపల్లి జానకిరాం, బత్తుల సుభాషిణి రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, ఎల్గూరి వెంకటేశం గౌడ్, కొప్పుల రాంరెడ్డి, జంగిలి సైదులు తదితరులు పాల్గొన్నారు.