సంఘామేశ్వర లాడ్జ్ లో శవమై తేలిన శివలిల.
అనుమానాస్పద స్థితిలో మృతి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కందివనం గ్రామానికి చెందిన శివలిలా కనుమరుగయింది. గత రెండేళ్ల క్రితం ప్రమాదంలో భర్తను కోల్పోయిన శివలిల తన పనేండేళ్ల కుమారుడితో కలిసి తన పుట్టినిల్లు నర్సప్ప గూడాలో జీవనం సాగిస్తుంది. గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తితో జంటగా సంగమేశ్వర లాడ్జ్ కు చేరుకుంది.మూడు రోజులుగా గదిలోనే నివసిస్తున్నారని భావించిన లాడ్జ్ నిర్వహకులకు రూంలో నుండి దుర్వసన వెదజల్లడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా విగతాజీవిగా పడి ఉన్న శివలీల మృత దేహాని గుర్తించారు.వెంటనే అంబులెన్సు సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతికి గల కారణలపై తమదైనా శైలిలో దర్యాప్తు చేస్తున్నారు షాద్ నగర్ పోలీసులు..