ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు 60ఏళ్ల నుండి 65 ఏళ్ల వయస్సు పెంచయడం వలన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయస్సు పెంచడాన్ని నిరసిస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ 3 ప్రతుల ను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11యూనివర్సిటీ లలో సుమారు 2000 అధ్యాపక పోస్ట్ లు ఖాళీలను భర్తీ చేయకుండా,వివిధ యూనివర్సిటీ లలో పని చేస్తున్నా సీనియర్ ఫ్యాకలిటీ లను వినిగించుకునే పేరుతో రిటర్మెంట్ వయసు 60ఏళ్ల నుండి 65ఏళ్ల వయసుకి పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననిరుద్యోగ యువత నోట్లో మట్టి గొట్టే నిర్ణయమే అని మండిపడ్డారు. తెలంగాణ ఆరు దశబ్దాల పోరాటం లో ఉద్యోగుల చుట్టే తిరిగింది అని,తొలి మలి దశ పోరాటం విద్యార్థి, నిరుద్యోగ యువత త్యాగల ఉద్యమల తోటే కొనసాగిందని,
సమైక్య రాష్ట్రము లో జరిగినట్లే, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రలో కూడా నిరుద్యోగ యువతకు అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం అన్ని శాఖ లలో ఖాళీగా ఉన్నా సుమారు 1లక్ష 50 వేల ఉద్యోగాల ను వెంటనే భర్తీ చేయాలనీ కోరారు.
ప్రభుత్వ అన్ని శాఖల విభాగాల ఉద్యోగుల రిటర్మెంట్ వయసు పెంపుదలను విరమించుకోవాలని కోరారు.లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా తెలంగాణ విద్యార్థి ,నిరుద్యోగ యువత మరో పోరాటం చేస్తున్నదని ప్రభుత్వన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు బాసిపంగు సునీల్ తెలంగాణ యువజన సంఘము జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ మార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పంతం యాకయ్య, నాయకులు దారావత్ వెంకటేష్ నాయక్, కోడి సురేష్, కొలిక పంగు వాసు, చామకూరి మహేందర్, రాహుల్ నాయక్, శ్యామ్, రోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.