బడి ఈడు పిల్లలు ఉండవలసింది బడిలో పనిలో కాదు
గుండాల మండల కేంద్రంలో
బ్రతుకు దెరువు కోసం వలస వచ్చి ఇటుక బట్టీలో పని చేస్తున్న బాల కార్మికున్ని గుర్తించి బడిలో చేర్పించిన సి ఆర్ పి దేవనబోయిన లింగయ్య.బడి బయట విద్యార్థులను గుర్తించే సర్వేలో భాగంగా తుర్కలశాపురం ఆవాస ప్రాంతంలో ఊరికి దూరంగా ఉన్న ఇటుక బట్టీల వద్దకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన బత్తుల వెంకట నర్సయ్య తిరుపతమ్మ పిల్లలు తురకల షాపురం ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు వారి వద్దకు వెళ్ళిన సిఆర్పి మాట్లాడుతూ చదువుకునే వయసున్న విద్యార్థిని పనిలో పెట్టొద్దని వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ పేదరికాన్ని జయించేది చదివేనని వారికి చదువు విలువ వివరించి బత్తుల నాగబాబు 12 సంవత్సరాల వయసు గల విద్యార్థిని సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపడిశాల లో ఏడవ తరగతిలో చేర్పించడం జరిగింది.