ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ , టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది, రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవ ర్గానికి కూడా ఎన్నిక జరగ నుంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చ్ 29,వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
పదో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహ రణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
మార్చ్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నిక ప్రక్రియను మార్చి 8వ తేదీ వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
రాష్ట్రంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
*ఎన్నికల షెడ్యూల్ తేదీలు*
నామినేషన్ల ధాఖలు ఫిబ్రవరి 3, నామినేషన్ దాఖలు చివరి తేదీ ఫిబ్రవరి 10, నామినేషన్లు పరిశీలన ఫిబ్రవరి 11, నామినేషన్ ఉపసంహరణ ఫిబ్రవరి 13, పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27, ఓట్ల లెక్కింపు మార్చి 3,