బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి 

బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి 

 

ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న..

 

భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కర్రె సంజీవరెడ్డిని నియమిస్తూ అధిష్టానం సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న నియామక ఉత్తర్వులు సంజీవరెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పునర్వైభవానికి పాటు పడుతానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment