విద్యా లక్ష్యాలను విస్మరించిన పాలకులు పి డి ఎస్ యు రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు.
4, 5తేదీలలో జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్లు ఆవిష్కరణ. విద్యారంగ బలోపేతం కోసం, పాలకులు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై, విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం, ఫిబ్రవరి 4,5 తేదీలలో బత్తుల నగర్, (శుభం ఫంక్షన్ హాల్) భద్రాచలం పట్టణంలో జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని పి డి ఎస్ యు రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్యులు నామాల ఆజాద్. కాంపాటి పృధ్వీ పిలుపునిచ్చారు. స్థానిక భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి.డి.ఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతిశీల విద్యార్థి రత్నాలు కామ్రేడ్ జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి స్నేహలత లాంటి అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యను పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా కాషాయకరణ చేయడం కోసం యూనివర్సిటీలలో విసీల నియామకాలు గవర్నర్లకు కట్టబెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయకపోవడం దుర్మార్గమన్నారు. విద్యారంగంలో మోడీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో మత చాందస భావాలను చొప్పించేటువంటి మతోన్మాద విధానాలను తప్పికొడతామన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండి విద్యారంగ సమస్యను పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని విస్మరించడం సమంజసం కాదన్నారు. కనీసం విద్యార్థులకు ఇవ్వవలసి నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, మెస్, కాస్మొటిక్ బకాయిలను కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 4, 5 తేదీలలో భద్రాచలం పట్టణంలో జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో తీర్మానాలు చేసుకొని తీర్మానాల వెలుగులో భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని, గత ఉద్యమాలను సమీక్షించు కొని, భవిష్యత్ విద్యార్థి ఉద్యమ బలోపేతం కోసం కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి శివ ప్రశాంత్, నాయకులు నరసింహారావు సంధ్య, శృతి, అనూష, బాలకృష్ణ, సాయి, వర్షన్, చిరంజీవి. తదితరులు పాల్గొన్నారు.