రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ రగ్బీ పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక
ఈ నెల1 నుండి 3 వ తేదీన మంచిర్యాల జిల్లా నస్పూర్ కె.జి.ఏ. డిఫెన్స్ అకాడమీ మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ రగ్బీ పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల 7వ తరగతి విద్యార్థి గణేష్ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు తగురం తిరుపతి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్ మరియు ప్రధానోపాధ్యాయులు హకీం ఖాన్ విద్యార్థిని సన్మానించారు.