కామ్రేడ్ రామచంద్రపు యాకయ్యకు విప్లవ జోహార్లు.
-సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజనల్ కమిటీ.
కామ్రేడ్ రామచంద్రపుయాకయ్య సోమవారం సాయంత్రం ఖమ్మం ప్రశాంత్ హాస్పిటల్ లో గుండెపోటుతో బాధపడుతూ మృతి చెందారు.ఆయన మృతి పట్ల సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజనల్ కమిటీ విచారాన్నివ్యక్తం చేస్తూ కామ్రేడ్ యాకయ్య మృతదేహం పై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య,నందగిరి వెంకటేశ్వర్లు బయ్యారం సబ్ డివిజనల్ కమిటీ సభ్యులు రామచంద్రపు మురళి,వల్లాల బిక్షంలు కామ్రేడ్ యాకయ్య భౌతిక కాయం పై అరుణ పతాకాన్ని కప్పి విప్లవ జోహార్పించి వారి కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కామ్రేడ్ యాకయ్య తల్లిదండ్రులు పూర్వపు వరంగల్ జిల్లా కొత్తపెళ్లి గ్రామం నుండి గత 65 సంవత్సరాల క్రితం వెంకట్రాంపురం గ్రామానికి వచ్చి పేద రైతుగా జీవనం కొనసాగిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ గడ్డం వెంకట్రామయ్య (దొరన్న) 1969 సంవత్సరంలో సిపిఎంఎల్ విప్లవ కమ్యూనిస్టుపార్టీలో నాయకత్వం వహిస్తూ అండర్ గ్రౌండ్ కు వెళ్లాడు ఆ క్రమంలో కామ్రేడ్ యాకయ్య బావమరిది మేడారపు అప్పయ్య కూడా కామ్రేడ్ దొరన్నతోపాటు అజ్ఞాతంలోకి వెళ్ళి పని చేస్తున్న క్రమంలో వారి ప్రేరణతో సిపిఐ ఎంఎల్ పార్టీలో సభ్యునిగా చేరి ఈ ప్రాంతంలో పార్టీ నిర్వహించే అనేక ప్రజా పోరాటాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కామ్రేడ్ దొరన్నకు కొరియర్ గా పని చేస్తూ కష్టజీవులైన వ్యవసాయ కూలీల రేట్లు.పాలేర్ల వేతనాల పెంపుకై ముఖ్యభూమికను పోషించాడు భూస్వామ్య. పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా రాజీ లేకుండా పోరాడాడు. వడ్డీ నాగుల దోపిడిని అరికట్టడంలో క్రియాశీలక పాత్రను పోషించాడు. ఈ క్రమంలో అనేక పోలీసు నిర్బంధాలను తప్పుడు కేసులను భరిస్తూ మొక్కవోని ధైర్యంతో పట్టుదలతో పార్టీలో పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులను ఆటుపోట్లనుఅధిగమిస్తూ పార్టీ నాయకత్వంలో నిర్వహించే పోరాటాలలో క్రియాశీలక పాత్ర పోషించాడు నిలబడ్డాడు. కామ్రేడ్ యాకయ్యకు మరోసారి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజనల్ కమిటీ తరుపున వినమ్రంగవిప్లవ జోహార్లు అర్పిస్తున్నాం.