అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితా విడుదల
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల ప్రకారం, ప్రత్యేక సవరణ 2025 లో భాగంగా, మెదక్ జిల్లా పరిధిలోని 34-మెదక్, 37-నర్సాపూర్ , అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నాడు విడుదల చేశారు. (34-మెదక్) అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని,1,04917 మంది పురుషులు, 1,15987 మంది మహిళలు, 04 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 220908 సాధారణ ఓటర్లు ఉన్నారు.
వీరిలో 9 మంది పురుషులు, 1 మహిళ ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు. సర్వీస్ ఓటర్లలో 87 మంది పురుషులు, 2 మహిళలు కలిపి 89 మంది ఉన్నారు. (37-నర్సాపూర్) అసెంబ్లీ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని 1,11611 మంది పురుషులు, 118701 మంది మహిళలు, 05 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 2,30317 సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒకరు ఎన్‌ఆర్‌ఐ ఓటరు ఉండగా, సర్వీస్ ఓటర్లలో 36 మంది పురుషులు, 02 మహిళలు కలిపి 38 మంది ఉన్నారు. మొత్తం జిల్లావారీగా 216528 మంది పురుషులు, 234688 మంది మహిళలు, 09 మంది థర్డ్ జెండర్ కలిపి 451225 సాధారణ ఓటర్లు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల ప్రకారం, పై ఓటర్ల జాబితాలను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ఈఆర్ఓ కార్యాలయాల్లో, ఏఈఆర్ఓ తహసీల్దార్ కార్యాలయాల్లో, అలాగే జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ కార్యాలయంలో ప్రచురించారు. ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందని ధృవీకరించుకోవాలని, ఏవైనా పొరపాట్లు లేదా మార్పులు అవసరమైతే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని లేదా అధికారిక ఎన్నికల వెబ్‌సైట్‌ను సందర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.