వేదాంత భజన మందిరంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీరామ చంద్రమూర్తి
సూర్య భగవానుని ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలనిశ్రీ వేదాంత భజనమందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వర రావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ లో గల శ్రీ వేదాంత భజనమందిరం లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్ర స్వామిని ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఆదిత్య హృ దయం స్తోత్రం పఠించారు. సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించి, భక్తులకు వితరణ చేశారు.అన0తరం పట్టణంలో కొలాటాలతో శోభాయాత్ర నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ధరూరి సింగరాచార్యులు మాట్లాడుతూ సూర్య భగవానుడు ఉత్తరాయణం లో ప్రవేశించి తన వీ క్షనతను లోకానికి చూపిస్తాడని,నేటి నుండి వేసవికాలం ప్రారంభం అవుతుందని,సూర్యుని ప్రతాపంతో ఎండలు మండిపోయినా తరువాత చల్లని వర్షాలు పడి పంటలు పండి రైతులు సంతోషంగా వుంటారని అన్నారు. , ఈ పూజా కార్యక్రమాలలో అర్చకులు దరూరి రాఘవాచార్యులు, దరూరీ రామానుజా చార్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నకరికంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్ భక్తులు చల్లా సత్యనారాయణ, సందీప్, చిల్లంచర్ల సోమేష్, గోరంట్ల సందీప్ వుద్ద శ్రీనివాస్, సోమ రాజు చిత్తలూరి శ్రీధర్, వరగాని వెంకటేశ్వర్లు శీలా శంకర్, రాచర్ల ప్రేమలత, నకరికంటి హేమలత, మౌనిక, రమ, స్వాతి, బిందు, కళ్యాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.