పెంకు కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ర్యాలీ .

పెంకు కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ర్యాలీ .

 

-తెలంగాణ టైల్స్ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు.

 

బయ్యారం మండల కేంద్రంలో పెంకు ఫ్యాక్టరీలలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ బుధవారం తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్ల కృష్ణ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం మండల తహాశీల్దార్ బి.విజయకు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.పెంకు ఫ్యాక్టరీల యాజమాన్యాల నిరంకుశత్వాన్ని వారు ఖండించారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రామ్ సింగ్,ఎస్కే మదర్,మూతి రాంబాబు,లింగయ్య,శ్రీరాములు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment