జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములనా పక్షోత్సవాలలో భాగంగా జాతీయ రహదారి పై ర్యాలీ

జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములనా పక్షోత్సవాలలో భాగంగా జాతీయ రహదారి పై ర్యాలీ

 

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి 

డాక్టర్ రవికుమార్

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ వర్డతి సందర్బంగా జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములనా పక్షోత్సవాలలో భాగంగా జాతీయ రహదారి పై ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి ఫిబ్రవరి 13వరకు జరిగే కుష్ఠు వ్యాధి సర్వే గురించి అవగాహనా సదస్సు మరియు అదేవిధంగా కుష్ఠు వ్యాధి గ్రస్తులపై వివక్ష చూపబోమని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి గాలి ద్వారా మరియు సన్నిహిత సాన్నిధ్య వల్ల ఒకరి నుండి ఒకరికి మైక్రో బాక్టీరియా లేప్రే మరియు మైక్రో బాక్టీరియా లేపరోమాటుస్ అనే బాక్టీరియా వలన వ్యాపిస్తుందని, వ్యాధి ప్రారంభ దశలో, ఎటువంటి అంటు వ్యాధులు లక్షణాలను చేపించకుండా 5 నుండి 20ఏళ్ళు ఉంటుంది. వ్యాధి లక్షణాలు చర్మం మీద కందిన లేదా రంగు మారిన మచ్చలు, స్పర్శ లేకపోవడం,చర్మం పై బొడిపెలు, పొడిబారిన మరియు గట్టిబడిన చర్మం, కనురెప్ప వెట్రుకలు మరియు కనుబొమ్మలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బ తినడం, చేతి వేళ్ళు, కాలివేళ్ళు చిన్నగా అవడం, కండరాల బలహీనత, నరాల, శ్వాసనాళ క్షిణత ఉంటాయని,వ్యాధి ని త్వరగా గుర్థించి 6నుండి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి,హెల్త్ సూపెర్వైసోర్స్ కృష్ణ, సుదర్శన్, ఆచార్యులు, లక్ష్మి,పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఉపేంద్ర, సరిత, అఖిల, తరణి,ఏ ఎన్ ఎం ఎస్, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ప్రవీణ్,ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment