ప్రజా ప్రతిభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు

ప్రజా ప్రతిభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు

 

 

 సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతిభ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను జిల్లా బ్యూరో సభ్యులు వీరేశం ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు చేతుల మీదుగా ప్రజా ప్రతిభ క్యాలెండర్ ను ఆవిష్కరించి మిత్రులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ పత్రికలు సమాజానికి దిశా నిర్దేశం చేసే లాగా ఉండాలని, వాస్తవాలను నిర్భయంగా అందించేవిగా ప్రజల పక్షాన పోరాడే విధంగా, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే విధంగా పనిచేయాలని సూచించడం జరిగింది. ఎటువంటి ఒత్తిడిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పత్రికా విలేకరులందరికి విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా రిపోర్టర్ కె.వీరేశం, మోహిజ్ భాయ్ కోహీర్, పరమేశ్వర్, సోమశంకర్ మరియు పి. ఎం.ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version