ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు
సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో నూతనంగా స్థాపించిన ఆంజనేయస్వామి విగ్రహ శిఖర, ద్వజస్తంభ, ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఎల్లారం గ్రామంలో ఇంత చక్కటి ఆలయాన్ని ధ్వజస్తంభమును ఏర్పాటు చేసినటు వంటి హనుమాన్ భక్తులందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇట్టి మహోన్నతమైన కార్యక్రమానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ఎల్లారం గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.