రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
వట్పల్లి లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం :- వట్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటిఆర్ పిలుపు మేరకు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు సొమవారం నాడు వట్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో రైతు భరోసా మాట ఇచ్చిన పదిహేను వేయల రుపాయాలతో పాటు, రెండు సార్ల రైతు భరోసా బకాయి డబ్బులు వేయకుండా తెలంగాణ రైతులను మోసం చేసినందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు మాట్లాడుతు రైతు భరోసా బకాయి డబ్బుల మరియు మాట ఇచ్చిన పదిహేను రూపాయలు వేంటనే రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అద్యక్షుల అశోక్ గౌడ్, మండల సర్పంచ్ లు ఫోరం మాజీ అధ్యక్షులు బుద్ధిరెడ్డి, మార్కెట్ మాజీ డైరెక్టర్ల మధు, అప్పారావు, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రకాష్, మాజీ సర్పంచ్ అబ్దుల్ సత్తార్, గ్రామ రైతు బంధు అద్యక్షులు మాల్లారెడ్డి, మండల నాయకులు అబ్దుల్ సత్తార్, మండల ఉపాద్యాక్షులు, వీరారెడ్డి, మండల నాయకులు పల్లె కిషన్ రావు, వీరన్నస్వామి, లక్ష్మణ్ గౌడ్, అజిమొద్దిన్, ధర్మారెడ్డి, విఠల్ మేస్త్రి, యాదగిరి గౌడ్, మౌలాన్ సాబ్, నిజాం, గోల్ల యాదయ్య, రాందాస్, మోనేశ్వర్, గోపాల్, గుండయ్య, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.