ఆరుగురు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ గా ప్రమోషన్
ప్రమోషన్ ఆర్డర్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
సూర్యాపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నందు పనిచేస్తున్న ఆరుగురు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా ప్రమోషన్ లభించింది. ఈ సందర్భంగా వారు ఎస్పీ నుండి ప్రమోషన్ ఆర్డర్ పత్రాలను అందుకున్నారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐ లను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తన కార్యాలయం నందు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, క్రమశిక్షణతో ఉంటూ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. అనుభవాన్ని కొత్త వచ్చిన సిబ్బందికి నేర్పాలని కోరారు.
*ప్రమోషన్ పొందిన వారు.*
పి.శ్రీనివాసులు మెళ్ళచెరువు పీఎస్, పి. మల్లయ్య మద్దిరాల పిఎస్, జే.శ్రీనివాసు కోదాడ రూరల్ పియస్, ఖయ్యూమ్ కోదాడ ట్రాఫిక్ పి ఎస్, నరేందర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ సూర్యాపేట, సిహెచ్. వెంకన్న సీసీఎస్ సూర్యాపేట.
ఈ కార్యక్రమం నందు ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం పోలీసు సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్ర గౌడ్ సెక్షన్ సూపర్టెండెంట్ శ్రీకాంత్ ఉన్నారు.