నూతన క్యాలండర్ ఆవిష్కరించిన మరిపెడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు
దేవరశెట్టి కృష్ణమూర్తి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో
చార్మినార్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక నూతన క్యాలండర్ మరిపెడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరశెట్టి కృష్ణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం మరిపెడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలపై ఎన్నో వార్తా కథనాలతో చార్మినార్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక అనతికాలంలోనే ప్రజాదరణ పొందిందని నిజాన్ని నిర్భయంగా వెలికి తీసి వార్త కథనాలు రాయడంలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి దినపత్రిక అని అన్నారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ యాజమాన్యం,రిపోర్టర్లు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం,అధికారులకి నాయకుల దృష్టికి తీసుకెళ్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న యాజమాన్యానికి, విలేకరులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరశెట్టి లక్ష్మీనారాయణ, దేవరశెట్టి వెంకన్న, వెళ్లే శంకర్, దేవరశెట్టి శ్రీకాంత్, పాల్గొన్నారు