బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వంటరు ప్రతాప్ రెడ్డి.
జగదేవపూర్ : మండల పరిధిలోని మాంధపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్ర నర్సింలు తల్లి నర్ర సత్తమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి సత్తమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. స్థానిక మాజీ ఎంపిటిసి కిరణ్ గౌడ్,గ్రామ అధ్యక్షులు జహంగీర్, సాయిలు,రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.