పూసల్ పాడు టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన
నారాయణపేట జిల్లా పరిధిలో పదవ తరగతి విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి ప్రతి సంవత్సరం పూసల్ పాడ్ గ్రామానికి చెందిన షేర్ ఎల్లారెడ్డి జ్ఞాపకార్ధం వారి కుమారుడు షేర్ కృష్ణ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పూసలపాడు టాలెంట్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మక్తల్ మండలం లోని వివిధ గ్రామాల నుండి 600 మంది విద్యార్థులు మక్తల్ పట్టణంలో నిర్వహించిన వివిధ పరీక్షా కేంద్రాలలో హాజరు కావడం జరిగింది. పరీక్ష నిర్వహణకు ముఖ్య అతిథి గా విచ్చేసిన శ్రీ భాస్కర్ రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిండం వల్ల విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు బయట పడుతాయని, ఈ పరీక్షలు వారికి భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.పరీక్ష నిర్వహణకు తపస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, రాకేష్ కుమార్ సమన్వయకర్త వెంకట్ రాములు ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి ప్రవర్ధన్ ,నరేష్ కుమార్ ,అనిల్ రెడ్డి, రాజాంజనేయులు, ధన్సింగ్,శివరాజు,వెంకట్రెడ్డి,కేశవులువంశి,వినయ్,రవి,రమేష్,వనజ,పుష్పలత,సుభాషిణి, విజయశ్రీ, నరసప్ప, ప్రైవేట్ పాఠశాలలఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది