చేతనైతే అభివృద్ధి చేసి చూపించు …..

చేతనైతే అభివృద్ధి చేసి చూపించు …..

వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో తూప్రాన్, ఆగస్టు…30 ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ ప్రజల పక్షాన నిలబడి పెంచిన పన్నులను రద్దు చేయాలని అధికారికి మెమొరండం అందచేస్తే విధులను దుర్వినియోగం చేశామని మాపైన కేసులు పెట్టడం సరికాదని వారు అసహనం వ్యక్తం చేశారు. గతంలో మేము అధికారంలో ఉండగా ఏనాడు సామాన్యుని నడ్డి విరిచే విధంగా పన్నులు పెంచ లేదన్నారు ముఖ్యంగా మున్సిపల్ లో పనిచేస్తున్న సఫాయి సిబ్బంది జీతాలు 5 నుండి 6 వేల వరకు ఉన్నదని వారు పలుమార్లు మాతో జీతభత్యాలు సరిపోవడం లేదని మొర పెట్టుకోవడం జరిగిందని దీని దృష్ట్యా మున్సిపల్ లోని వాణిజ్య వ్యాపార వర్తక సంఘ నాయకులను పిలిపించి కమర్షియల్ గా ఉన్న వ్యాపారస్తులతో సపాయి సిబ్బంది యొక్క ఇబ్బందులను మీరు గమనించాలని అందుకే కమర్షియల్ వ్యాపారస్తులపై కొంతమేర పనులు పెంచవలసి వస్తుందని వారితో తెలియజేసినాము వారు ఏకీభవించిన పిదప పన్నులను పెంచడం జరిగింది. తప్ప మిగతా ఏరకంగా పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజల పైన పన్నుల పెనుబారని మోపలేదని వారు తెలిపారు. రాష్ట్రంలో ఏ మున్సిపల్ లో ఇప్పటి వరకు అధికారికంగా పనులు పెంచలేదన్నారు, పూర్తి ఆధారాలు మాదగ్గర ఉన్నాయన్నారు, ముఖ్యంగా నాపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలను పూర్తిగా మానుకోవాలన్నారు మున్సిపల్ ప్రజా ప్రతినిధుల దృష్టి ప్రజల పైన ఉండాలి తప్ప ఎవరేం చేస్తున్నారని వ్యక్తిగత దూషణకు పోకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా నా ఇంటి పన్ను ఫంక్షన్ హాల్ పన్ను కట్టలేదని ఇప్పుడున్న మున్సిపల్ ప్రజా ప్రతినిధులు నాపై తప్పుగా ఆరోపించడం సరికాదని నేను కట్టిన ఇంటి పన్ను రసీదు నా వద్దనే ఉన్నదని పేర్కొంటూ శివ సాయి ఫంక్షన్ హాల్ నాది కాదని నాపేరు మీద లేదని ఇందులో నా కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఈ ఫంక్షన్ హాల్ ను లీజుకు ఇవ్వడం జరిగిందని దీన్ని బాగోగులు వారే చూసుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ పన్నులు కట్టకపోతే అధికారులు డిమాండ్ పత్రాన్ని నోటీసులను జారీ చేయాలని అలా కాకుండా అధికారులు నిర్లక్ష్యంతో మాపై బురద చల్లడం సమంజసం 

కాదని హితవు పలికారు. 

మా ఏకైక లక్ష్యం పెంచిన 

పన్నులను తక్షణమే ఉప సంహరించుకోవాలని లేనిపక్షంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నాలు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తామని డిమాండ్ చేశారు, మా ఏకైక ఎజెండా లక్ష్యం ప్రజల పక్షాన నిలబడి పెంచిన పనులను తగ్గించే వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బైరం సత్య లింగం, ఎండి సత్తార్, బొంది వెంకట గౌడ్, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, దుర్గా ప్రవీణ్ రెడ్డి, బనాపురం ప్రవీణ్, బి మల్లేష్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment