రాబోయే ఎన్నికల ఏదైనా విజయం బీజేపీ దే
జన్యావుల రామకృష్ణ
రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుందని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జన్యావుల రామకృష్ణ అన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కంటోన్మెంట్ నియోజక వర్గంలోని 8 వార్డులకు నూతన అధ్యక్షులను నియమించారు. వారిచే సమావేశం ఏర్పాటు చేసిన రామకృష్ణ పలు అంశాలపై చర్చించారు. కంటోన్మెంట్ లో గడప గడపకు బీజేపీ ని తీసుకువెళ్లాలని కలసిగట్టుగా పనిచేస్తూ ప్రజాసమస్యలపై పోరాడుతూ పార్టీ ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నూతన వార్డ్ అధ్యక్షులు పాల్గొన్నారు.