పేటలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు.
పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేటలోని ప్రియాంక కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయం ఆలయానికి ఆదివారం సాయంత్రం ఘనంగా మహిళలు బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని భాజా భజంత్రీలతో కాలనీలో ఊరేగింపుగా వచ్చి నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. పలువురు మహిళలు భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం. తదితర సామాగ్రిని సమర్పించారు. అమ్మవారికి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రియాంక కాలనీవాసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.