అసమర్ధ కాంగ్రెస్ పాలన నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన పేట మండల బి.ఆర్.ఎస్ నాయకులు.

అసమర్ధ కాంగ్రెస్ పాలన నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన పేట మండల బి.ఆర్.ఎస్ నాయకులు.

 

 

పెద్ద శంకరంపేట్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్ద శంకరంపేటలో గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా పేట మండల బి.ఆర్.ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ 6 గ్యారంటీలు.420 హామీల అబద్ధపు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాలుగా మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికీ రైతులకు రైతు భరోసా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మాణిక్ రెడ్డి. సుభాష్. అంజయ్య . నరసింహులు. మాజీ కో ఆప్షన్ యదుల్లా.మాణిక్యం.అశోక్. మంగలి శ్రీనివాస్.వెంకట అశోక్ దుర్గయ్య నాందేడ్ సాయిలు నగేష్ శనిగరి సాయిలు బేతయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment