ప్రజలు ఆన్లైన్ అరెస్టులు నమ్మొద్దు
రేగోడ్ మండల ఎస్సై పోచయ్య మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రేగోడు మండల పరిధిలోని పోచారం గ్రామం బస్టాప్ వద్ద శనివారం నాడు వాహనదారులకు ప్రజలకు సైబర్ ఆన్లైన్ అరెస్టులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఎస్సై ప్రజలతో మాట్లాడుతూ మిమ్మల్ని అరెస్టు చేస్తామని మీ పిల్లలపై కేసులు ఉన్నాయని మీ కుమారుడు జైల్లో పెడతామని గుర్తుతెలియని వ్యక్తులు ఎలాంటి ఫోన్ చేసినా నమ్మి మోసపోకూడదు అని పోలీసులు ఎప్పుడు ఆన్లైన్లో ఎలాంటి విషయాలు జోక్యం చేసుకోరు కావున ఆన్లైన్ అరెస్టులపై ఎవ్వరు కూడా భయపడకూడదని ప్రజలకు సూచించడం జరిగింది గుర్తుతెలియని వ్యక్తులకు నమ్మి మోసపోకూడదని ఎస్సై పోచయ్య తెలిపారు