సూర్యాపేట జిల్లాలో సన్నీ లియోన్ సందడి.. ఆగి మరీ చూసిపోతున్న జనం
సాధారణంగా హీరోయిన్ల ఫోటోలు సినిమా థియేటర్లలో, అభిమానం ఉంటే ఇళ్లలో, లేదంటే గోడల పైన చూస్తాం. కానీ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండా నుంచి గంటోని గూడెం వెళ్లే రోడ్డు పక్కన్న మిర్చి తోటలో ఓ రైతు హీరోయిన్ ఫోటో పెట్టి వినూత్నతను చాటుకున్నాడు. మిర్చి తోటకు నర దిష్టి తగలకుండా, జంతువులు పంట పొలాలను నాశనం చేయకుండా ఉండటానికి రైతులు దిష్టి బొమ్మలను పెడతారు. కానీ ఆ రైతు మాత్రం నరదిష్టి తగలకుండా ఏకంగా హీరోయిన్ సన్నీలియోన్ కటౌట్ పెట్టేశాడు. ఈ ఫోటోను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.