పరిటాల రవీంద్ర ఒక శక్తే కాదు ఒక వ్యవస్థ

పరిటాల రవీంద్ర ఒక శక్తే కాదు ఒక వ్యవస్థ

 

 బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి పరిటాల రవీంద్ర

 

పరిటాల ఆశయ సాధనే ఆ కుటుంబ ధ్యేయం

 

 మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి 

 

వెంకటాపురంలో స్వర్గీయ పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘన నివాళులు 

 

రామగిరి మండలం వెంకటాపురం లో స్వర్గీయ పరిటాల రవీంద్ర 20 వర్ధంతి వేడుకలకు హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తోపాటు భారీగా తరలివచ్చిన పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి కుటుంబ సభ్యులు 

 

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత స్వర్గీయ పరిటాల రవీంద్ర అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. దివంగత నేత స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి వేడుకలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున హాజరై రామగిరి మండలం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్వగ్రామం వెంకటాపురం లో శుక్రవారం పరిటాల ఘాటు వద్ద పరిటాల రవీంద్ర గారికి పరిటాల సునీతమ్మ తోపాటు మంత్రి సవితా, హిందూపురం ఎంపీ పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ , అనంతపురం ,సత్యసాయి ఉమ్మడి జిల్లాల టీడీపీ అధ్యక్షులు కల్వకుంట్ల అంజినప్ప, వెంకట శివడు యాదవ్ ,రాయల్ మురళీ,రామూర్తి నాయుడు, ముంటీమడుగు కేశవ రెడ్డి,రామలింగారెడ్డి ,వెంకటప్ప ,బెస్త చలపతి, సామకోటీ ఆదినారాయణ , విజయకుమార్ ,నాగరాజు చెన్నకేశవలు ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ యువ నేత పరిటాల శ్రీరామ్ తోపాటు పరిటాల రవీంద్ర సతీమణి రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. పరిటాల రవీంద్ర తో 1993 నుంచి 2005 వరకు ఉన్న సన్నిహిత సంబంధాల్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిటాల కుటుంబ సభ్యులతో గుర్తు చేశారు. పరిటాల రవీంద్ర గారి హయంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో టిడిపి పార్టీ కోసం ఆయన చేసిన సేవలో ఎనలేని అన్నారు సామూహిక వివాహాలను నిర్వహించి ప్రజలకు మరింత దగ్గరయ్యారని తెలిపారు. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో పరిటాల రవీంద్ర తగిన పాత్ర పోషించారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు పరిటాల రవీంద్ర అండగా నిలిచారని అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. అదే బాటలో పరిటాల కుటుంబం ముందుకు పోతుందని భవిష్యత్తులో మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పరిటాల రవీంద్ర ఆశ సాధనకు ఆ కుటుంబం పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సిందూర ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment