కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలవుతుంది

కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలవుతుంది

 

ఫిబ్రవరి 7వరకు వర్గీకరణ చేయకుంటే

 

లక్ష డప్పులు వేల గొంతులతో హైద్రాబాద్లో సునామీ సృష్టిస్తాం

 

 ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 

 

కొత్త బస్టాండ్ వద్ద మంగళహారతి పట్టి స్వాగతం పలికిన మాజీ కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ

 

కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలవుతుందని ఎస్సీ ఎబిసిడి వర్గీకరణకు రేవంత్ రెడ్డి సర్కారు కట్టుబడి ఉంటే ఫిబ్రవరి 7వ తేదీకి ముందే నిర్ణయం తీసుకోవాలని లేదంటే ఫిబ్రవరి 7న మాదిగల సునామీ హైద్రాబాద్ ను తాకుంతుందని ఆ సునామీలో ఎవరైనా కొట్టుకుపోక తప్పదని ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 7న హైద్రాబాద్ లో నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయనకు మాజీ కౌన్సిలర్ వల్దాస్ సౌమ్యాజాని మంగళహరతులు పట్టి స్వాగతం పలుకగా డప్పు కొడుతూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణాలో మొదటగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన మాటను ఐదు నెలలు అయినా నిలబెట్టుకోకపోవడంతోనే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఫిబ్రవరి 7న మా లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం నిర్వహించే అవసరమే ఉండేది కాదన్నారు. నిండు శాసనసభలో చెప్పిన మాటను నిలబెట్టుకోలేక పోయాడని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేశారని ఇక్కడ అమలు చేయలేకపోయారని అన్నారు. నోటిఫికేషన్కు ముందే వర్గీకరణ చేస్తామని చెప్పి మాల రాజకీయ నాయకులు తెచ్చిన వత్తిడి మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో ఎంతో మంది మాదిగ నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అడ్డుతగిలే మాలలకు బవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తామని వారి మాటలు విని వర్గీకరణ చేయకుంటే రేవంత్ సర్కార్ కూడా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఏది కావాలో తేల్చుకోవాలని మాలలు స్వార్ధపరులని అన్ని రంగాల్లో ఎదిగారని వాళ్ళు ఇంకా మాకు అడ్డం తగిలితే మౌనంగా చూస్తూ ఊరుకోమని వారి మాటలకు విలువిచ్చి వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలవుతుందన్నారశాంతియుతంగా ప్రదర్శనకు వెళుతున్నామని వర్గీకరణ చేస్తే మేము స్వాగతిస్తామని లేని పక్షంలో మా డప్పులే మా అగ్రహాన్ని తెలియజేస్తాయన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు డప్పు వేసుకొని సునామిలా హైద్రాబాద్కు తరలిరావాలని వేలాది మంది కళాకారుల గొంతులతో జరిగే సాంస్క్రతిక కార్యక్రమాన్ని మాదిగ బిడ్డలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ విజయవంతం చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment