బెల్లి లలిత సోదరుడు కృష్ణ తో మన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్ ముఖాముఖి.

బెల్లి లలిత సోదరుడు కృష్ణ తో మన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్ ముఖాముఖి.

మలి దశ తెలంగాణ ఉద్యమ నాయకుడు

గొల్ల కురుమ డోలు దెబ్బ వ్యవస్థాపకుడు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కిలక మైలు రాయి..డోలు దెబ్బ సంఘం

అలాంటి గోప్ప ఉద్యమ నాయకులు డోలుదెబ్బ వ్యవస్తాపకులు బెల్లి కృష్ణ గారితో మన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్ ముఖాముఖి.

 ప్రశ్న :- గొల్ల కురుమ డోలు దెబ్బ ఎందుకు స్థాపించారు.?

జవాబు :- తుర్కపల్లి కి చెందిన పిడుగు కిష్టయ్య గారి గోర్లు అడవి తోడేళ్లు వచ్చి 40 గొర్రెలను కోరికేయడంతో నాకు బాధగా అనిపించి ఎమ్మార్వో ఆఫీస్ లో దరఖాస్తు పిడుగు కిష్టయ్య గారు ఇచ్చినారు.

ఎమ్మార్వో గారు అడవి జంతువులని అడవి జంతువు తినేసింది దీనికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేమని ఎమ్మార్వో చెప్పడంతో అక్కడనే నేను ఉండి అడవి జంతువులు ఎలా అవుతాయి దాని ఉన్ని, దాని మాంసం, దాని ఎరువు మన సమాజానికి ఎంతో అవసరం అలాంటి దానిని అడవి జంతువు అనడం కరెక్ట్ కాదని ఎమ్మార్వో కు నేను చెప్పాను. నా జాతి గొల్లకురుమలు అడవికే పరిమితం అయి చదువు లేకుండా సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఇలాంటి అనేక సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే అప్పుడు 14 మండలాలో ప్రతి గ్రామంలో గొల్లకురుమలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకొని గొల్ల కురుమ డోలు దెబ్బ స్థాపించాను.దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర చేసి అందరిని కలిసి కమిటిలు వేసాం.

ప్రశ్న :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గొల్ల కురుమలని ఎప్పుడైనా ఏకం చేశారా..?

జవాబు :- 1996 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కురుమ డోలు దెబ్బ పిలుపుతో భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి భువనగిరిలో దాదపు ముప్పైవేల మందితో భువనగిరి కాలేజీ మైదానంలో సభ ఏర్పాటు చేసి గొల్ల కురుమల ఐక్యత చేసినాము. ఈ బహిరంగ సభకు నక్క లక్ష్మీనారాయణ యాదవ్ గారు కొంతమంది స్నేహితులు ఆర్థికంగా సహకరించారు. ఈ బహిరంగ సభ వల్ల అగ్రకులాలు భయపడి మా చెల్లి బెల్లి లలితను అప్పటి ప్రభుత్వాలు హత్య చేసినాయి.

ప్రశ్న:- తెలంగాణ ఉద్యమ సమయంలో డోలుదెబ్బ పాత్ర..?

జవాబు :- తెలంగాణ ఉద్యమానికి డోలుదెబ్బ సంఘంతో ఉరురా నా జాతిని ఐక్యం చేస్తునే నా చుట్టు జరగుతున్న నా తెలంగాణ ప్రజల బాదాలను చూస్తు తట్టుకోలేక మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి అంటు ఉద్యమం మొదలు పెట్టం అంతకు ముందు సారా వ్యతిరేక పోరాటం, వ్యభిచార నిర్ములన పోరాటం ఇలా సమాజంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు గురించి అందరికి మంచి జరగాలని ఉద్యమాలు చేసాం దాని కొనసాగింపుగా మా తెలంగాణ మాకు అంటు ఉరురా ఉద్యమాలు చేసాం నా చెల్లెలు తన గళంతో మా తెలంగాణ మాకు అంటు అందరిని ఎకం చేసింది.ఇది చూసి ఒక మహిళా పాట పాడుతూ అందరిని ఎకం చేస్తు ప్రత్యేక తెలంగాణ అంటుందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మాదవరెడ్డి కలిసి నా చెల్లెలుని కిరాయి హతకులతో చంపించారు.

ప్రశ్న :- భువనగిరి నాయీంతో మీకు ఎలాంటి పరిచయము ఉండేను…?

జవాబు :- నాయీం నేను ఒకే క్లాస్ నాకు మంచి స్నేహితుడు.

ప్రశ్న :- నాయీం కూడా నక్సల్ని అతమార్చాడని అంటుంటారు మీరేమైనా చెప్పగలరా..?

జవాబు :- నాయీంను ప్రభుత్వమే పెంచి పోషించి గ్యాంగ్ స్టార్ చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాధవ రెడ్డి వీరి అండదండలతోటే నక్సల్ ను హతమార్చడం,భూ దందాలు చేయడం,కిడ్నాప్లు చేయడం,హత్యలు చేయడం, గ్యాంగ్ స్టార్ గా ఎదిగిపోయాడు.

ప్రభుత్వానికి కోవర్టుగా మారిపోయాడు.

ప్రశ్న :- మీరు 17 సంవత్సరాలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు..?

జవాబు :-నా చెల్లి బెల్లి లలితను అప్పటి ప్రభుత్వం అలీంమోద్దిన్ తో హత్య చేయించింది.

అలీంమోద్దిన్ ను నక్సల్ చంపేయడంతో ఆ మర్డర్ కేసు నాపై శ్రీరాం రాముల్ యాదవ్, బద్దుల మల్లేష్ పై మర్డర్ కేసు పెట్టడంతో మేమే చేశామని నయీమ్ మాపై కసి పెంచుకొని మమ్మల్ని కూడా హత్య చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్న సమయంలో మేము అజ్ఞాతంలోకి వెళ్ళినాము. శ్రీరాం రాములు యాదవ్ గారు బద్దుల మల్లేష్ యాదవ్ గారు రెండు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి వాళ్ళ గ్రామాలకు వెళ్లడంతో ఇదే అదును చూసి నయీమ్ వారిద్దరిని మరో వ్యక్తి ఇక్కిరి సిద్దులును కిడ్నాప్ చేసి ముగ్గురిని హత్య చేసారు. నాకుటుంబాని రక్షించుకోవడం కోసం 17 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళినాను.

ప్రశ్న :- నయీమ్ ఎన్ కౌంటర్ వార్త వినగానే మీకు సంతోషం అనిపించిందా.. లేదా బాధగా అనిపించిందా..?

జవాబు :-నయీమ్ చనిపోగానే నాకు నా స్నేహితుని కోల్పోయానని బాధగా అనిపించింది.

కానీ.. మరోరకంగా చాలా చాలా సంతోషం కూడా అనిపించింది.

ప్రశ్న :- అజ్ఞాతం నుండి వచ్చిన తర్వాత మీరేం చేశారు..?

జవాబు :- అజ్ఞాతం నుండి వచ్చి బహుజన డెమోక్రటిక్ ప్రంట్ వ్యవస్తాపకునికగా ఎర్పాటు చేసి బహుజనులను ఏకం చేసి బహుజనులకు రాజ్యం కావాలని పోరాటం చేశాను.

ప్రశ్న :- మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నారని తెలిసింది…?

జవాబు ;- పకృతి వైద్య విధానంతో నా బహుజన ప్రజల ఆశీస్సులతో నా ఆరోగ్యం మెరుగు పడుతుంది. త్వరలో ప్రజలందరినీ తప్పకుండా మళ్ళీ కలుసుకుంటాను. జై తెలంగాణ.

Join WhatsApp

Join Now

Leave a Comment