వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..

వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి..

ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం..

 

ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

వడ్డే ఓబన్న 218 వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని నీలం మధు క్యాంపు కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు,ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంజలి దస్తగిరి,బీరాంగూడ కృష్ణ,వలేపు వెంకటేశ్, పిట్ల లక్ష్మణ్, రాజ్ కుమార్,శ్రీను, అభిరామ్,ఈశ్వర్, గోపాల్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version