శీర్షిక
నువ్వు బాధపెట్టిన తట్టుకొనేంత..,
నువ్వు అనుమానించినా ఓర్చుకునేంత..,,
నువ్వు అవమానించిన మన అనుకొనేంత..,,
నువ్వు తిట్టినా,కొట్టినా ఓర్చుకొనేంత..,,
నువ్వు విలువ ఇవ్వకున్నా సర్దుకొనేంత..,,
నువ్వు పట్టించుకోకున్నా పరవాలేదనుకొనేంత..,,
నీ మీద మాటలో చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ..,,
నా మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థం కావడం లేదు..,,
పైసలు ఇచ్చే ఆనందం కొన్ని రోజులు మాత్రమే..,,
మనసుకు నచ్చిన వాళ్ళు ఇచ్చే ఆనందం
ఎప్పటికి నిలిచిపోతుంది..,,
కొంచెం సర్దుకుపోయి చూడు
జీవితం ఎంత అందంగా ఉంటుందో! తెలుస్తుంది..,,
కోపంతో నిర్ణయం తీసుకోకు..,,
ఆలోచించు నీకు నా ప్రేమ అర్థం అవుతుంది..,,
నీ ఆశలు తీర్చే శక్తి నాకు లేకపోవచ్చు..,,
నీ కంట కన్నీరు రాకుండా చూసుకునేంత
ప్రేమ నాలో ఉంది..,,
ప్రేమించుకోవడానికి తొందర పడొచ్చు…
పెళ్లి చేసుకోవడానికి తొందర పడొచ్చు కానీ…
విడిపోవడానికి తొందర పడకూడదు…
అగ్నిసాక్షిగా మొదలైన మన బంధం..,,
ప్రేమతో కలిసి ఉన్న క్షణాలు
నీకు గుర్తు రావడం లేదా..,,
ఎందుకు కలిపాడో ఆ దేవుడు
నీ మనసు రాతి బొమ్మగా మార్చి
నాతో ఇలా ఆడుకుంటున్నాడు..,,
ఉన్న దాంట్లో జీవితం చాలా అందంగా ఉంటుంది..,,
లేనిపోని ఆశలకుపోతే ఆగమవుతుంది బ్రతికే
మన బంధం కాదు అనుకోని వేరైతే
ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం అవుతాము..