జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిట
లాడిన దేవాలయాలు
— కోదండ రామాలయంలో పూజలో పాల్గొన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్తర ముఖ ద్వారం గుండా వేలాదిగా భక్తులు ఆయా దేవాలయాల్లో దేవుళ్ళను దర్శిం
చుకున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్లోని కోదండ రామాలయంలో
మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్య
క్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రామాలయానికి భారీగా మహిళా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రతినిధు
లకు నాయకులకు ప్రజలకు మేలు
కోరే పథకాలను అమలు చేసే విధం
గా ఆశీర్వదించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరేలా ఆ భగవంతుడు ప్రజాప్రతినిధులకు
సంకల్పం కల్పించి ప్రజలందరికీ మేలు జరిగేలా చేయాలని ఆ దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్, ఆర్కే శీను పలు
వురు నాయకులు పాల్గొన్నారు.