50 వేల ఫోన్ల రికవరీ.. రెండో స్థానం తెలంగాణ పోలీస్ శాఖ

50 వేల ఫోన్ల రికవరీ.. రెండో స్థానం తెలంగాణ పోలీస్ శాఖ

రెండో స్థానం తెలంగాణ పోలీస్ శాఖ

మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఫోన్ల రికవరీల ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్లు, పోలీసులకు ప్రశంసా పత్రాలను మంగళవారం అందజేశారు.యూనిట్ లెవల్ నోడల్ అధికారులు, పీఎస్‌వోలు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత 2023 ఏప్రిల్ 20 నుంచి 2024 నవంబర్ 3 వరకు 50,788 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేశారు. మిస్సయిన మొబైల్స్‌ను కనుక్కోవడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డీవోటీ అభివృద్ధి చేసిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ని ఉపయోగించి మొబైల్ రికవరీలో దేశవ్యాప్తంగా 2వ స్థానంలో నిలవడం పోలీస్ శాఖ సాధించిన విజయమని పేర్కొన్నారు. తెలంగాణలో 2023 ఏప్రిల్ 19న ప్రారంభమైన ప్రయోగాత్మకంగా ప్రారంభించబడిన తర్వాత 2023 మే 17న జాతీయ స్థాయిలో ఈ సేవలను విస్తరించినట్లు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్‌కు స్టేట్ నోడల్ అధికారిగా శిఖ గోయోల్ పని చేస్తున్నారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 50,788 డివైజ్ రికవరీలు చేసినట్లు వెల్లడించారు. కర్ణాటక కన్నా 172 రోజులు ముందే ఈ మైలు రాయిని చేరుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సగటున రోజుకు 91 మొబైల్ డివైజ్‌లను రికవరీ చేస్తుందన్నారు. సిటిజన్ యాక్సెస్, తెలంగాణ పోలీసులు, డీవోటీ సమన్వయంతో, సీఈఐఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించారు. పౌరులు టీజీ పోలీస్ సిటిజన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన తమ వస్తువులను www.tspolice.gov.inలో లేదా నేరుగా www.ceir.gov.in లో నివేదించవచ్చని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment