పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు*

*పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు*

*నూతనంగా ఆర్ కే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం*

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్:26

చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె చిల్డ్రన్స్ హాస్పిటల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మామిడి వెంకట్, మామూనురి రమేష్ వేల్పుల రవి లు మాట్లాడుతూ గత మూడేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు నూతనంగా పిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండనుందని అన్నారు. అనుభవం కలిగిన వైద్యుడిచే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకొని ఆదరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version