స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు విద్యార్థుల హక్కు……

స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు – విద్యార్థుల హక్కు……

పెండింగ్ లో ఉన్న ₹ 7500 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు టీవీరియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
– ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్

తూప్రాన్ పట్టణ కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 21 ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బ్రతుకులు మారడం లేదని గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరింత విధ్వంసం చేస్తుందని . స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న విద్యారంగానికి బడ్జెట్ కనీస నిధులు కేటాహించకుండా గతం కంటే తక్కువ (6.5%) కేటాయించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అవగతం అవుతుంది.

పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత చదువు కోసం సంజీవని లాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లుపొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. గత మూడు సంవత్సరాలుగా దాదాపు రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నా ఈ ప్రభుత్వం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరును ఏబీవీపీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రాష్ట్రంలో స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ పై ఆధారపడి దాదాపు 15 లక్షల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వకుండా. ఫీజు రీయింబర్స్ చేయకుండా పేద విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే కుట్ర చేస్త్నుది. పేద విద్యార్థులపై ప్రభుత్వ కుట్రలు ఆపి వెంటనే పెండింగ్లో ఉన్న 7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలనీ ఏబివిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కార్యకర్తలు కార్తీక్.ఎల్లం.అబు సాయికిరణ్.అనిల్ .తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version