చేతబడి చేస్తున్నారు అనే అనుమానంతో ఒకే కుటుంబనికి చెందిన ఐదుగురి హత్య
అనారోగ్యానికి గురైన ఓ కుటుంబంలోని వ్యక్తి
చేతబడి వల్లనే అని భావించిన గ్రామస్తులు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అంతమొందించిన వైనం
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర ఆచారాలకు ఎంతోమంది బలవుతున్నారు.తాజాగా చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు హత్యకు గురయ్యారు.ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. చేతబడి వల్ల ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్న అనుమానంతో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు