లైన్స్ క్లబ్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో క్రీడ పరికరాలు అందజేత
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్: 23
లైన్స్ క్లబ్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో మోరి శెట్టి అంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఎం. ఏ .ఎం) లో పదివేల రూపాయల విలువ గల క్రీడా పరికరాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయరాలు టీ. రేణుక దేవి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా వస్తువుల దాత మదన్మోహన్ రేపాల పీఎంజేఎఫ్ మాట్లాడుతూ జీవితంలో ఎంత సంపాదించినా తిరిగి కొంత ఇచ్చే స్వభావం కలిగి ఉండాలన్నారు. సహాయం అవసరం ఉన్నవారికి మనకు తోచిన సహాయం చేసే గుణం కలిగి ఉండాలని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని, కృత్రిమ మేధస్సు వలన రాబోయే పరిణామాలు అందిపుచ్చుకోవాలని, మనదేశంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో 80 శాతం పైగా ప్రభుత్వ విద్యార్థులేనని అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్ .సి వెంకటేశ్వరరావు, జెడ్. సి లక్ష్మీకాంతరెడ్డి, స్పందన అధ్యక్షులు సుధాకర్, నాతి సవేందర్ కుమార్, జి. అశోక్ రెడ్డి, ఎన్. పిచ్చయ్య , కె. లక్ష్మారెడ్డి,పి. నరసింహారెడ్డి, శబరి మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.