కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం 

కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం 

 

 చార్మినార్ ఎక్స్ ప్రెస్ భీమదేవరపల్లి ప్రతినిధి జనవరి 10

 

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈనెల 10 తారీకు నుండి 18 వ తేదీ వరకు జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. 14 తేదీన మకర సంక్రాంతి పర్వదినం ఎడ్ల బండి తిరుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రూ.10 లక్షల తో గుట్ట పైకి మెట్ల దారి పనులు ప్రారంభించగా, రూ. 35లక్షలతో చేపట్టిన ధ్యాన మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. ఇటీవల ఆలయ అభివృద్ధికి 26 పనులు చేపట్టేందుకు రూ. 75 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదించారని, త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ఈవో వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 పైగాపోలీసులతో భారీ బందోబస్తు చేపట్టనున్నారు. గుడి లోపల, ఆలయ పరిసర ప్రాంతంలో 30 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపారు. నాలుగు వైపులా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జాతరలో ములకనూరు పి హెచ్ సి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు 24 గంటలు, సుమారు 30 మంది వైద్య సిబ్బందితో వైద్య సేవలు అందించ నున్నట్లు వైద్య అధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment