ఉత్తర భారతీయుల ప్రత్యేక పండగ ఛట్ పూజ

ఉత్తర భారతీయుల ప్రత్యేక పండగ ఛట్ పూజ ఉపవాస దీక్ష ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్ చెరువు సాకి చెరువు కట్టపైన సూర్య భగవానుని మందిర నిర్మాణానికి రేపు శంకుస్థాపన…

ఆలయ నిర్మాణానికి సొంత నిధులు 5లక్షల విరాళం ప్రకటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

ఉత్తర భారతీయుల అతి ముఖ్యమైన పండుగ ఛట్ పూజ ఈ రోజు ఉపవాస దీక్షతో ప్రారంభం కాగా, పటాన్చెరువు లోని సాకి చెరువు కట్ట వద్ద నిర్వహించిన ఛట్ పూజ ఉపవాసదీక్ష పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొని, పూజను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ పటాన్ చెరువు ప్రాంతంలో దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు కాబట్టి వారి ఆచారాలకు, ప్రముఖ పండుగలకు పెద్దపీట వేస్తూ సమ ప్రాధాన్యతతో పండుగలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు.

సాకి చెరువు కట్ట పైన నిర్మించే శ్రీ సూర్య భగవానుని మందిర నిర్మాణానికి తన వంతు సాయంగా 5 లక్షల రూపాయల సొంత నిధులు అందజేస్తానని కార్పొరేటర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

అనంతరం డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, ఆల్విన్ కాలనీలలో జరిగిన ఛట్ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సందీప్ షా,సంజయ్ సింగ్, టింకు పటేల్, ప్రిన్స్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment