ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదే జర్నలిజం….
జర్నలిస్ట్ లను సన్మానించిన దుర్గా మాత రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రాంచంద్రం గుప్త
హాజరైన ప్రముఖులు బుడ్డ భాగ్యరాజు, డాక్టర్ అఫ్సర్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 16 ప్రతినిది
తూప్రాన్ జర్నలిస్ట్ లను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా దుర్గా మాత రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రాంచంద్రం గుప్త, బుడ్డ భాగ్య రాజు, డాక్టర్ అఫ్సర్, కుమ్మరి రమేష్, యాదగిరి, బల్ రాంరెడ్డి ల బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కైలాస్ రాం చందర్ గుప్త మాట్లాడుతూ తూప్రాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నానరని గుర్తు చేశారు. అనంతరం బుడ్డ భాగ్య రాజ్ మాట్లాడుతూ పత్రికా రంగం సమాజానికి అద్దంగా నిలుస్తుంది. నిష్పక్షపాతంగా, ధైర్యంగా, నిజాయితీతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయుల కృషి ఎనలేనిది అని అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను సమన్వయంతో ప్రజలకు అందించి, సమాజం చైతన్యవంతం కావడానికి సహాయపడుతున్న పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లు డాక్టర్ జానకిరామ్, బుక్క అశోక్, ఐ.రవీందర్, శివ శంకర్ గౌడ్, పెద్ది గారి నగేష్, గైనిభైటి భాస్కర్ గౌడ్, ఎస్. సంధీప్, రాజ శేఖర్, జయ్ పాల్ రాథోడ్, గౌస్ భాయ్, అఖిల్ భాయ్, భూషణం చారి, గడ్డం ప్రశాంత్ కుమార్, వి.శివ కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హారి ప్రసాద్, పూర్ణ రాజు, డి.కృష్ణ, పి.ఆంజనేయులు గౌడ్ , కే.వేణుగోపాల్, చందూ, కే.మోజేస్, వి.దయానంద్ గౌడ్, హర్ష వర్ధన్ గౌడ్ తదితరులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు.